- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు న్యాయం జరగాలి : కోదండరాం
దిశ, వెబ్‌డెస్క్ :
అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ఇప్పటికైనా మహిళా కమిషన్ ఏర్పాటు చేసి బాధితురాలికి అండగా ఉండాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కోదండరాం విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి పోరాడతామని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే సచివాలయం వంటి నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. సీఎం కేసీఆర్‌కు తన సౌకర్యాలు చూసుకోవడంలో ఉన్న ఆసక్తి ప్రజా భద్రతపై లేదని ధ్వజమెత్తారు.