- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు మంత్రి కొడాలి!
దిశ,వెబ్ డెస్క్: ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లేందుకు మంత్రి కొడాలి నాని సిద్దమవుతున్నారు. ఈ నెల 21 వరకు మీడియా ముందు, సమావేశాల్లో మాట్లాడొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలపై ఆదేశాలను కోర్టులో సవాల్ చేయాలని మంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ఆయన సిద్దం అయ్యారు. కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
కాగా ఎస్ఈసీపై మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్ అయింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రికి ఎస్ఈసీ శుక్రవారం షోకాస్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మంత్రి ఆ వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. అయితే మంత్రి వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో మంత్రి ఈ నెల 21వరకు మీడియా ముందు మాట్లాడకూడదని ఎన్నికల సంఘం ఆంక్షలు జారీ చేసిన సంగతి తెలిసిందే.