- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రాలది అవగహనలేని ఆరోపణలు: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సిన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ ప్రోక్యూర్ అవుతుందన్న అంశాలను గమనించాలని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెలంగాణకు 71 లక్షల 23 వేల 50 డోస్ ల వ్యాక్సిన్ ను కేంద్రం పంపిణీ చేపట్టిందని తెలిపారు. వీటిలో ప్రభుత్వ ఆసుపత్రికి 65,86,650 డోస్‌లు, 27 ప్రైవేట్ ఆసుపత్రులకు 5,36 ,600 డోస్‌లు సరఫరా చేశామని చెప్పారు. 4 లక్షల 90 వేల డోస్ ల వ్యాక్సిన్ ను ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ కోనుగోలు చేసిందని వివరించారు. రేమిడిసివిర్ తెలంగాణకి 3 లక్షలు, ఆంధ్ర కు 6 లక్షల మందులకు కేంద్ర సరఫరా చేసిందన్నారు. 450 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ తెలంగాణకు, 590 మెట్రిక్ టన్నులు ఆంధ్రాకు అందిచామన్నారు.
బ్లాక్ ఫంగస్ మెడిసిన్ ఆంఫోటెరసిను తెలంగాణకు 10,120 వయల్స్, ఆంధ్రకు 12,230 వయల్స్‌ను పంపిణీ చేసిందన్నారు. వ్యాక్సిన్లు, మందులను సరళీకృతం చేసి సరఫరా చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దురదృష్టవశాత్తు మరణించిన 67 మంది జర్నలిస్టుల కు రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. జూన్ 30 వరకు లాక్ డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి రాష్ట్రాలకు ఇచ్చిందని చెప్పారు. లాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని ఆస్తులు అమ్మి బిల్లులు చెల్లిచాల్సించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.
రూ.లక్షల్లో బిల్లు చెల్లించినా ప్రాణం తో బతికి వస్తాడా అనేది అనుమానం కలుగుతుందన్నారు. ఫీజుల వివరాలను హాస్పిటల్స్ ముందు ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ఆనందయ్య మందు పై కేంద్రానికి విజ్ఞప్తి లు వచ్చాయని రాష్ట్రం పరిశోధించి కేంద్ర ఆయుష్ డిపార్ట్ మెంట్ కి పంపిస్తే దాన్ని సప్లిమెంట్ మెడిసిన్ గా వినియోగించే అవకాశం ఉందని తెలిపారు. కాక్ టైల్ మందు పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కోటికి పైగా వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయన్నారు. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతోందని చాలా వరకు వ్యాక్సిన్ కొరత తగ్గుతుందని వివరించారు. కేజ్రీవాల్ విచిత్ర మైన సీఎం అని రాష్ట్రాల గురించి కాదు, విదేశాల గురించి కూడా మాట్లాడతారని ఎద్దేవచేశారు. సింగపూర్ పై ఆయన చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందని గుర్తుచేశారు.