కియార ‘ఇందూ కీ జవానీ’ థియేటర్‌లోనే.!

by Shyam |
కియార ‘ఇందూ కీ జవానీ’ థియేటర్‌లోనే.!
X

దిశ, వెబ్‌డెస్క్: థియేటర్లు తెరుచుకుంటున్నాయి.. సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నాయి. మొత్తానికి కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు సాధారణం అవుతుండగా.. ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ కియారా అద్వానీ ‘ఇందూ కీ జవానీ’ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. డేటింగ్ యాప్స్ ద్వారా కాబోయే భర్తను వెతికే అల్లరి అమ్మాయిగా కియార ఈ సినిమాలో కనిపించనుండగా, తనకు జోడీగా ఆదిత్యా సీల్ కనిపించబోతున్నారు. కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ఉండటంతో ప్రజెంట్ జనరేషన్‌కు చక్కగా రీచ్ అవుతుందంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ముందుగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని భావించినా.. డిసెంబర్ 11న థియేటర్స్‌లోనే విడుదలవుతుందని అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశారు. అబిర్ సేన్ గుప్తా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను టీ సిరీస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్స్, ఎలక్ట్రిక్ ఆపిల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైకా సింగ్ సంగీతం అందించారు.

కాగా ఈ మధ్య ఓటీటీలో రిలీజైన కియరా అద్వానీ ఫిల్మ్ ‘లక్ష్మి’ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి పాజిటివ్‌తో పాటు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినా.. వ్యూయర్‌షిప్‌లో మాత్రం రికార్డ్ సృష్టించింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకులు కాగా.. సౌత్ ఫిల్మ్ కాంచనకు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story