త్వరలో అతిలోక సుందరి చిన్న కూతురి బాలీవుడ్ ఎంట్రీ

by Jakkula Samataha |
త్వరలో అతిలోక సుందరి చిన్న కూతురి బాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లోనే ‘దఢక్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్లలోనే జాన్వీ మంచి గుర్తింపు పొందగా.. చెల్లి ఖుషీ కపూర్‌ కూడా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ ఖుషీకి కూడా నటనపై ఆసక్తి ఉందని.. తను కూడా త్వరలో సినిమాల్లోకి వస్తుందని తెలిపారు.

అతి త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతోందన్న ఆయన.. తన దగ్గర అన్ని వనరులున్నా, వేరొకరు తనను ఇంట్రడ్యూస్ చేయడమే మంచిదని చెప్పారు. లేదంటే చిత్ర నిర్మాతగా నాకు, నటిగా తనకు సంతృప్తి ఉండదని అభిప్రాయపడ్డారు. ఖుషీ సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నానని.. తను ఎక్కువగా గౌరవించే, సురక్షితమని భావించే వ్యక్తి చిన్న కూతురిని బాలీవుడ్‌లో లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story