మానవత్వం చాటుకున్న సీఐ

by Shyam |

ఖమ్మం: లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు పట్టణంలోని త్రీ టౌన్ సీఐ శ్రీధర్ చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే.. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకే ఇంట్లో అద్దెకుంటున్న తొమ్మిది మంది రాజస్థాన్ కూలీలకు లాక్ డౌన్ నేపథ్యంలో పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో తమ వద్దనున్న సరుకులన్నీ అయిపోయాయి. కొందామంటే డబ్బులు లేవు. కొన్ని రోజులుగా తినడానికి తిండి లేక పస్తులుంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేసి, తమ గోడు వెల్లబోసుకున్నారు. కాల్ రిసీవ్ చేసుకున్న హైదరాబాద్ డీజీపీ కంట్రోల్ రూం వారు.. ఖమ్మం త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ శ్రీధర్.. బాధితుల వద్దకు చేరుకుని దాతల సాయంతో 10రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వర్లు, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఖాలిక్ పాల్గొన్నారు.

tags: lockdown, khammam, CI sridhar, three town police station, migrant labourers, corona, daily needs, distribution,

Advertisement

Next Story

Most Viewed