పేదలకోసం ఫ్రీగా డ్రెస్ బ్యాంక్.. ఎక్కడంటే ?

by Shyam |   ( Updated:2021-09-20 05:46:51.0  )
dress-bank
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటివరకు ‘బ్లడ్ బ్యాంక్, ఫుడ్ బ్యాంక్, బుక్ బ్యాంక్, ఐ బ్యాంక్’ గురించి విని ఉండొచ్చు గానీ ‘డ్రెస్ బ్యాంక్’ అంటే ఎవరికి తెలియదు. అయితే కేరళ, మలప్పురం-పాలక్కడ్ సరిహద్దు ప్రాంతంలోని తూత్త అనే శివారు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి.. ‘డ్రెస్ బ్యాంక్’ అనే సరికొత్త చారిటీ మోడల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన ఇనిషియేటివ్ ద్వారా పేద కుటుంబాల మహిళలకు వెడ్డింగ్స్ క్లాత్స్‌ను ఫ్రీగా అందజేస్తున్నాడు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఒక్కసారే యూజ్ చేసిన వెడ్డింగ్ డే డ్రెస్సులను నాసర్ స్టార్ట్ చేసిన ‘డ్రెస్ బ్యాంక్’కు డొనేట్ చేస్తున్నారు. ఇలా సేకరించిన దుస్తులను కేరళతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల పేద కుటుంబాల్లోని వధువులకు ఫ్రీగా అందజేస్తున్నాడు నాసర్. ఇప్పటి వరకు కేరళవ్యాప్తంగా 155 మంది మహిళలు డ్రెస్ బ్యాంక్ నుంచి పొందిన వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ ధరించడం విశేషం. ఏడాదిన్నర కిందట సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన నాసర్.. పెళ్లి బట్టలు కొనేంత ఆర్థిక స్థోమతలేని నూతన వధువులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ డ్రెస్ బ్యాంక్‌ను స్థాపించాడు. ఈ చారిటీ మొదట ఏప్రిల్ 2020లో చాలా మంది డొనేట్ చేసిన 100 వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్‌తో ప్రారంభం కాగా.. నాసర్ ముందుగా తన ఇంటి నుంచే ఈ డొనేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం విశేషం.

dress

సోషల్ మీడియా క్యాంపెయిన్..
వాట్సాప్, ఫేస్‌బుక్ ఉపయోగిస్తూ తమ ‘డ్రెస్ బ్యాంక్‌’కు వెడ్డింగ్ డ్రెస్సులు డొనేట్ చేయాలని సర్క్యులేట్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఇలా పలు చారిటీ ఆర్గనైజేషన్లు, ఫ్రెండ్స్ సాయంతో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బట్టలను డ్రైక్లీనింగ్ చేయించిన తర్వాత అవసరమైన వారికి అందజేస్తున్నాం. ఈ దుస్తులకు వాస్తవానికి రూ. 3 – 6 వేల ఖర్చవుతుంది. వధువు, వారి తల్లితండ్రులు నేరుగా డ్రెస్ బ్యాంక్‌ను సందర్శించి ధరతో సంబంధం లేకుండా అవసరమైన దుస్తులు ఎంచుకోవచ్చు. వాటిని ఉపయోగించిన తర్వాత తిరిగివ్వమని ఎవరినీ అడగం. ఇక్కడ వివిధ మతాలు, కులాల వివాహ ఆచారాలన్నింటికీ దుస్తులు ఉన్నాయి.
– నాసర్, డ్రెస్ బ్యాంక్ ఫౌండర్

Advertisement

Next Story

Most Viewed