ఐసోలేషన్‌వార్డు మెనూ : ఎగ్స్, ఫిష్ ఫ్రై, జ్యూస్‌లు..

by Shamantha N |
ఐసోలేషన్‌వార్డు మెనూ : ఎగ్స్, ఫిష్ ఫ్రై, జ్యూస్‌లు..
X

తిరువనంతపురం : ఐసోలేషన్‌వార్డు అంటే కొందరు బెంబేలెత్తిపోతున్నారు. అదొక జైలులా ఫీల్ అవుతున్నారు. అందుకే, అలాంటి భ్రమలేమీ పెట్టుకోవద్దని ఐసోలేషన్‌వార్డులో ఉన్నవారూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కేరళ సర్కారు అందిస్తున్న మెనూ చూస్తే మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులపై నెలకొన్న భయాలు పటాపంచలవ్వాల్సిందే.

ఎర్నాకుళం కలెక్టర్ ఎస్ సుహాస్ ప్రకారం.. కలమస్సేరీ ప్రభుత్వ వైద్యకళాశాల.. భారతీయులకు, విదేశీయులకు ప్రత్యేక మెనూను అందిస్తున్నది. ఉదయం దోశా సాంబర్ లాంటి అల్పాహారం, రెండు బాయిల్డ్ ఎగ్స్, బత్తాయి పండ్లు, టీ-బిస్కెట్లు, మినరల్ వాటర్, పండ్ల జ్యూస్‌లు, మధ్యాహ్న భోజనంలోకి చపాతీలు, ఫిష్ ఫ్రై, మీల్‌ అందిస్తున్నది. రాత్రిపూట అప్పం, కర్రీ, అరటి పండ్లు సర్వ్ చేస్తున్నది.

విదేశీయులకైతే.. ఉదయం సూప్‌తోపాటు బాయిల్డ్ ఎగ్స్, జ్యూస్‌లు, మధ్యాహ్నానికి టోస్టెడ్ బ్రెడ్, చీజ్, జ్యూస్, రాత్రికి గుడ్ల వంటకం, టోస్టెడ్ బ్రెడ్, పండ్లు అందిస్తున్నది.

Tags: isolation ward, coronavirus, kerala, govt medical college, ernakulam, menu, eggs, fish fry

Advertisement

Next Story