- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్మృతి ఇరానీ వయానాడ్‌లో సాయం’ అబద్ధం: పినరయి
తిరువనంతపురం: కేరళలోని వయానాడ్‌లో చిక్కుకున్న యూపీలోని అమేథీకి చెందిన వలస కార్మికులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాయం చేసినట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్న వేళ సహాయక చర్యలపైనా తప్పుడు రిపోర్టులు, వదంతులు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా, అమేథీలో పరాజయం పొందినా కేరళలోని వయానాడ్‌లో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే అమేథీకి చెందిన వర్కర్లను రాహుల్ గాంధీ నియోజకవర్గంలోనూ స్మృతి ఇరానీనే పర్యవేక్షిస్తున్నదన్న తప్పుడు వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ కూడా ఈ రిపోర్టును ప్రచురించడం గమనార్హం. కాగా, వయానాడ్‌లో చిక్కుకున్న వలస కార్మికులు తామంతట తాము వండుకుని తింటామని కోరగా.. కావలసిన సరుకులను వారికి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్టు తాజాగా, సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. అయితే, ఈ సహాయంపై స్మృతి ఇరానీ కానీ, ఆమె కార్యాలయం నుంచి కానీ ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
Tags: union minister, smriti irani, helps, migrant workers, wayanad, kerala, cm pinarayi vijayan