అక్టోబర్‌లో కీర్తి.. ‘ఐనా ఇష్టం నువ్వు’

by Anukaran |   ( Updated:2023-04-04 14:03:40.0  )
అక్టోబర్‌లో కీర్తి.. ‘ఐనా ఇష్టం నువ్వు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్, కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ద్వారా దర్శకులు కృష్ణ వంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్న చిత్రం గురించి నిర్మాత చంటి అడ్డాల తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు నిర్మాత నట్టి కుమార్. ఎక్స్‌ట్రా మనీ కోసం ఇదంతా చేస్తున్నారని.. కానీ ఈ సినిమాను తమకు అమ్మినట్లు బాండ్ పేపర్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు నట్టి కుమార్. అందమైన ప్రేమ కథను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. నాగబాబు కీలకపాత్రలో కనిపించబోతున్న సినిమాలో రాహుల్ దేవ్ విలన్ కాగా.. సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. అచ్చు అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు నిర్మాత.

Advertisement

Next Story