పెళ్లిపై క్లారిటి ఇచ్చిన మహానటి

by Shyam |
పెళ్లిపై క్లారిటి ఇచ్చిన మహానటి
X

దిశ వెబ్ డెస్క్ :
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ తనపై వస్తున్న రూమర్లను ఖండించారు. రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో పెళ్ళికి సిద్ధమవుతోందని , ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదనే, పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయంటూ పలు వెబ్ సైట్లలో వార్త వచ్చింది. పత్రికలు కూడా అదే మాటను రాశాయి. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని, అలాంటి పుకార్లను నమ్మ వద్దని కీర్తి సూచించారు.

మహానటి సినిమాతో కీర్తి సురేష్ .. ఎనలేని అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో జాతీయ అవార్డును అందుకుంది. దాంతో అవకాశాలు వెల్లువెత్తాయి. మహానటితో వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంది. చేతి నిండా సినిమాలున్నాయి. కెరీర్ మంచి ఫామ్ లో ఉంది. ఇలాంటి సమయంలో.. కీర్తి పెళ్లి చేసుకోబోతుందనే వార్త వెబ్ సైట్లలో, పత్రికల్లో జోరుగా ప్రచారం సాగింది. దీంతో కెరీర్ పీక్ లో ఉండగా.. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం ఏంటని ఇటు సినీ పరిశ్రమలోని వాళ్లు, అటు అభిమానులు ఆందోళన పడ్డారు. అందరూ అనుకున్నట్లే ఆ వార్తలో వాస్తవం లేదని స్వయంగా కీర్తి సురేష్ వెల్లడించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఇలాంటి పుకార్తను వ్యాప్తి చేయద్దని సూచించారు.

ఏడాది వరకు కాల్షిట్స్ ఫుల్ :

పెళ్లి విషయంపై ఆమెను ప్రశ్నించగా.. మరో ఏడాది వరకు సినిమాలతోనే బిజీగా ఉంటానని, వచ్చే ఏడాది వరకు కాల్షీట్స్ ఇచ్చానని ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని కీర్తి సురేష్ ఎదరు ప్రశ్నించారు.. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాతే’ చిత్రంలోను – కార్తీక్ సుబ్బరాజు ‘పెంగ్విన్’ , మోహన్ లాల్ నటిస్తున్న ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ చిత్రాలు చేస్తున్నారు.అలాగే తెలుగులో రంగ్ దే చేస్తోంది. ‘మిస్ ఇండియా’ , గుడ్ లక్ సఖీ, చిత్రాల్లోనూ కీర్తినే నాయికగా కనిపించనుంది.

Tags: keerthi suresh, telugu heroine, south beauty, mahanati fame, rangde, telugu cinema

Advertisement

Next Story