- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ సంఘాలకు సీఎం కేసీఆర్ జబర్దస్త్ హామీ
దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల వేతన సవరణపై సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం… పలు కీలకమైన అంశాలపై హామీ ఇచ్చినట్లు చెప్పుతున్నారు. ఏపీలో 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొంత మెరుగ్గా రాష్ట్రంలో పీఆర్సీ ఇస్తామని, 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని సీఎం వెల్లడించినట్లు ఉద్యోగ నేతలు పేర్కొంటున్నారు.
మార్చి నుండి పదవీ విరమణ పెంపు
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపును 61 ఏండ్లకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ పెంపును మార్చి నుంచే అమలు చేస్తున్నట్లు సీఎం… ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చినట్లు చెప్పుతున్నారు. అదే విధంగా సీపీఎస్ ఉద్యోగుల అంశంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ స్కీంను వర్తింప చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగులతో భేటీతో సీఎం నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. మండలి ఎన్నికల కోడ్ ముగియగానే… దీనిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటుగా జూనియర్ పంచాయతి కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్ ను రెండేళ్లకు కుదించేందుకు కూడా అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వెల్లడవుతోంది. విఆర్వోలను సొంత శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కూడా సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.