- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మద్యంపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదు..
దిశ,హాలియా : తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల, నిడమనూరు, తిరుమలగిరి, సాగర్ తదితర మండలాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరున్నర ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తెలంగాణలో నిరుద్యోగులు ఆక్రోశంలో ఉన్నారని అన్నారు. ఉద్యోగ భర్తీల విషయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పేవన్ని దొంగ లెక్కలే అని విమర్శించారు.
రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రైవేటు ఎంప్లాయిస్ ఆకలి చావులతో ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఆరోపించారు. నిరుద్యోగులను, ఉద్యోగులను పట్టించుకోని దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసి ఛైర్మన్ మందుల సైదులు, ఇంచార్జి కంచి శ్రీనివాస్, ఉద్యమ నాయకులు వహిదుల్లా ఖాన్,ఆడేపు , అప్పారెడ్డి , ఆడేపు శివ కుమార్ ,సత్యనారాయణ, శివశంకర్, రామానుజం, నామా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.