- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల ఓట్ల కోసమే ఫిట్‌మెంట్ ప్రకటన
దిశ, సిద్దిపేట : పట్టభద్రుల ఎంఎల్‌సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ స్టంట్ కోసమే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. ఈరోజు సిద్దిపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్‌పై డిసెంబర్ నెలలోనే కమిటీ.. సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించినప్పటికి, దానిపై రెండు నెలలుగా ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు అందించనున్న ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం పునరాలోచించాలని, ఇవ్వనున్న ఫిట్‌మెంట్‌ను మరింత పెంచేలా నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఒడిపోతామనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల కన్నా టీఆర్ఎస్ శ్రేణులే ఎక్కువగా సంబరాలు చేసుకుంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంఎల్‌సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సలీం, గణేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.