- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు తెరదించారు సీఎం కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నదని, చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉన్నదని, ఇప్పుడే ముందస్తు చర్చ అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో రీజినల్ పార్టీలే కీలకంగా మారనున్నాయని, ఎంపీ స్థానాలన్నీ గెలవటంపై నేతలు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్లీనరి సమావేశానికి 14వేల మందిని ఆహ్వానించాలని భావించామని, దానిని ఆరు వేలకు కుదించినట్టు తెలిపారు. ఐడీ కార్డులున్న వారినే అనుమతిస్తారని చెప్పారు.
‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు…ఆ అవసరం మనకు లేదు… ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది… మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, వరంగల్ సభ, అధ్యక్షుడి ఎన్నికపై సుమారు 3 గంటల చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెలా 15న ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహించాలని, టీఆర్ఎస్పై మొరిగే కుక్కల నోర్లు మూయించాలని సూచించారు. 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామం నుంచి బస్సుల్లో అభిమానులను, పార్టీ కార్యకర్తలను తరలించాలని సూచించారు. రెండేళ్లలో పనులన్నీ పూర్తి చేసుకుందామని, మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు.
హుజురాబాద్ లో మనమే గెలుస్తాం
హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఎలాంటి అనుమానం, అపోహలు అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని సర్వేల్లో బీజేపీ కంటే 13 శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు. మిగతా పార్టీలు మన దరిదాపుల్లో లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలంతా మనవైపు ఉన్నారన్నారు. వారి అండతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో హుజురాబాద్ కు ప్రచారానికి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.
6 వేల మందితో ప్లీనరీ
ప్లీనరీని 14 వేల మందితో నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. కేవలం 6 వేల మందితోనే జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ముఖ్య నాయకులకు ఐడెంటిటీ కార్డులు అందించనున్నట్టు చెప్పారు. ఐడీకార్డు ఉంటేనే ప్లీనరీకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయి కమిటీలు పూర్తయ్యాయని, పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ప్రాంతీయ పార్టీలే కీలకం
‘ఎంపీ స్థానాలపై దృష్టి సారించాలి. కేంద్రంలో ఏకపక్షంగా సీట్లు రావు.. పోయిన సారి బీజేపీకి వచ్చాయి… ఈ సారి రావు… కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. గతంలో కంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానాలన్నింటిని కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను వేసుకుంటున్నందున.. ఆ కమిటీలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలని, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే సమాయత్తం కావాలని సూచించారు.