- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిల్ "కార్తికేయ 2" … పాన్ ఇండియా మూవీ?
హీరో నిఖిల్ సిద్ధార్థ్… వరుస విజయాలతో ఆనందంగా ఉన్నాడు. ఈ మధ్య అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్… అదే హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని ట్రై చేస్తున్నాడు. దీంతో తర్వాతి ప్రాజెక్టులు “కార్తికేయ 2”, “18 పేజెస్” విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ” కార్తికేయ” సినిమా నిఖిల్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ కాగా అంతకు మించిన స్క్రిప్ట్ తో “కార్తికేయ 2” పట్టాలెక్కిస్తున్నడు.
అయితే చాలా మంది హీరోలు ఇతర ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా… ఇతర భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారా? లేదా? అనే అంశంపై తాజా ఇంటర్యూలో ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఆ ఉద్దేశం లేదని… అయితే తాను పర భాషలో డైరెక్ట్ సినిమాలు చేయకపోయినా… “కార్తికేయ 2” మాత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ ప్రయత్నం ఫలిస్తే పాన్ ఇండియా మూవీ “కార్తికేయ 2” కు అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకుంటానని కూడా తెలిపారు. కాగా “కార్తికేయ” దర్శకుడు చందు మొండేటి.. ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండగా… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసమే నిఖిల్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నట్లు సమాచారం.
Tags : Nikhil, Nikhil Sidharth, Karthikeya 2, Pan India Movie