- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాట్ క్రాక్ చేసిన రైతు బిడ్డ
దిశ, ఫీచర్స్ : కలలు అందరికీ ఉంటాయి. కానీ, వాటిని సాకారం చేసుకునేది కొందరే. ఆశయ సాధనలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిస్థితులు వెక్కిరించినా కృషి, పట్టుదలతో తమ ఆశయం కోసం ముందుకు సాగుతూ విజయ తీరాలకు చేరుకుంటారు. అందుకు నిదర్శనమే ఓ మారుమూల గ్రామం రైతు కుటుంబంలో పుట్టిన రేవతి నాయక.. ప్రతిష్టాత్మకమైన క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసి మంచి ర్యాంకు సాధించి గ్రామ ప్రజల అభినందనలు అందుకుంటోంది.
కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన రేవతి నాయక.. ప్రతిష్టాత్మకమైన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో విజయం సాధించి, షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో జాతీయ స్థాయి 176వ ర్యాంకు తెచ్చుకుంది. దాంతో పాటియాలాలోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ‘లా’లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరనుంది. పరీక్షలకు కొద్ది నెలల ముందు కొవిడ్ బారినపడిన రేవతి కరోనాతోపాటు పరీక్షను జయించింది. కరువు పీడిత గ్రామమైన హుచ్చవ్వనహళ్లిలో నివసిస్తున్న రేవతి.. బాల్యమంతా రోజూ ఒక పూట తిండితోనే గడిచింది.
‘న్యాయ అధికారిగా సమాజానికి సేవ చేయాలనుకున్నాను. అయితే క్లాట్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఈ ఏడాది ఇక రాయలేను అనుకున్నాను. కానీ డ్రై వార్డ్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ జీవన్‌మూర్తి ఫీజు చెల్లించడంతో కష్టపడి చదివాను. అతడి సాయానికి రుణపడి ఉంటాం’
– రేవతి