రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

by Sridhar Babu |
రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు జరిపిన వేర్వేరు దాడుల్లో రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. గురువారం జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన శివనందుని లింగమూర్తి అనే వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నాడని పక్కా సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, సైదాపూర్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రాయికల్ గ్రామానికి చెందిన శివానందుని లింగమూర్తి, సిద్దిపేటకు చెందిన ముషినం రవిలను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కారు, రూ.3 లక్షల విలువైన గుట్కాను సీజ్ చేశారు. అనంతరం గుండ్లపల్లికి చెందిన పోతుగంటి నరేష్ కిరాణా షాపులో ఆకస్మికంగా తనిఖీలు చేసి రూ.లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story