గోల్కొండపై కాషాయ జెండా ఎగరేయడమే ధ్యేయం

by Shyam |   ( Updated:2020-03-15 08:49:31.0  )
గోల్కొండపై కాషాయ జెండా ఎగరేయడమే ధ్యేయం
X

దిశ, న్యూస్ బ్యూరో:
రాష్ట్రంలో నియంత, జాగీర్దార్ పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్, మజ్లిస్‌ పార్టీలను తరిమికొట్టి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేయడమే తన ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన నూతన అధ్యక్ష అభినందన సభ నిర్వహించారు.దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలన కొనసాగిస్తున్నాయన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో వీరి దౌర్జన్యాలను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఇక నుంచి కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైయిందన్నారు. కేసీఆర్‌కు కరోనా భయం కంటే.. బీజేపీకి నూతన అధ్యక్షుడు వచ్చిండన్న భయం ఎక్కువగా ఉందన్నారు. గుర్తు పెట్టుకో కేసీఆర్ నిన్ను గద్దే దించడమే తన లక్ష్యమని బండి సంజయ్ సవాల్ విసిరాడు. ఇక నీ మాయ మాటలు చెల్లవు, యాగాలు చేయడం హిందూ ధర్మం కాదని ఎద్దేవ చేశారు. నమ్మిన సిద్ధాంతం పేదల కోసం కట్టుబడి ఉండడం హిందూ ధర్మం అన్నారు. రాష్ట్రం మొత్తం తిరుగుతూ కేసీఆర్ బండారం భయట పెడతానని పేర్కొన్నారు. కేంద్రం నిధుల గురించే మాట్లాడే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్రం నుంచి వచ్చే నిధులున్నాయన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఏ సంక్షేమ పథకంలో కేంద్రం నిధులు లేవో లెక్క చెప్పాలన్నారు. నిధులు ఇవ్వడం లేదంటున్న కేసీఆర్‌ దమ్ముంటే నాతో పాటు ఢిల్లీకిరా రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలో నేను ఇప్పిస్తానన్నారు. దేశంలో ఎక్కడైనా విద్యావ్యవస్థలకు 15శాతం నిధులు కేటాయిస్తే..రాష్ట్రంలో 6శాతం కేటాయించి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు. ఉద్యోగులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే పోలీసులను అడ్డుపెట్టుకొని వారిని తరిమికొట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి మరోటి చేతకాదన్నారు. ఇక నుంచి నీ పోలీసు వ్యవస్థకు..నీ జైళ్లకు..లాఠీ దెబ్బలకు భయపడేది లేదన్నారు. రేపటి నుంచి యుద్ధానికి సిద్ధం ఎంత మందిని పోలీసులను తెచ్చుకుంటావో.. ఎన్ని లాఠీలు తెచ్చుకుంటావో తెచ్చుకో..పోరాటానికి ఏమాత్రం వెనకడగు వేసిది లేదని ఎంపీ సంజయ్ సవాల్ విసిరాడు. కేసీఆర్ కుటుంబ పాలన గోడలు బద్దలు కొట్టడానికి బీజేపీ కార్యకర్తలు మూడేండ్ల పాటు తమ శక్తివంచన పనిచేయాలని ఆయన పిలువు నిచ్చారు.

tags ; bjp state president, bandi sanjay, party meet, cm kcr, warning, g.kishan reddy

Advertisement

Next Story