- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవినీతికి అరుదైన గౌరవం.. సీసీ రజాక్ డిస్మిస్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని విధుల నుండి తొలగించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ స్థాయిల్లో పని చేసిన పోలీసు అధికారుల వద్ద క్యాంప్ క్లర్క్ (సీసీ)గా పని చేసిన రజాక్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో అతన్ని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ వన్‌టౌన్‌లో నమోదైన రెండు కేసుల్లో నిందితుల పేర్లను తొలగిస్తానని మహారాష్ట్రకు చెందిన జాదవ్ ప్రకాష్ అనే వ్యక్తి వద్ద రూ.3 లక్షల వరకు మామూళ్లు తీసుకున్నాడని, ఇందులో రజాక్ బ్యాంక్ లావాదేవీల్లో కూడా బాధితుని నుండి డబ్బులు తీసుకున్నట్టు రుజువైనట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేపట్టిన బెల్లంపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆరోపణలు నిజమేనని తేల్చారు. శాఖాపరంగా పోలీసు అధికారులు ఓరల్ ఎంక్వైరీ (ఓఈ) నిర్వహించారు. ఓఈలో పంచ్ విట్‌నెస్‌ల నుండి కూడా వాంగ్మూలం తీసుకుని రజాక్ అవినీతికి పాల్పడింది వాస్తవమేనని తేలడంతో ఉద్యోగం నుండి తొలగిస్తూ కరీంనగర్ పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.