- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీలో ముసలం.. హాట్ టాపిక్‌గా ఫంక్షన్ హాల్ మీటింగ్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా బీజేపీలో ఇంకా పరిస్థితులు చక్కబడ్డట్టగా లేవు. రాష్ట్రమంతా రేపు హుజురాబాద్‌లో ఏం జరుగుతుందోనన్న విషయంపై చర్చిస్తుంటే బీజీపీ నాయకులు మాత్రం వర్గాలతోనే సహవాసం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీనియర్లు, జూనియర్లు వేర్వేరుగా జట్టు కడుతున్నారు.
ఆదివారం జమ్మికుంట మండల కేంద్రంలో సీనియర్ బ్యాచ్, జూనియర్ బ్యాచ్‌లు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉదయం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు పి. సుగుణాకర్ రావు సీనియర్లతో సమాలోచనలు జరిపారు. మధ్యాహ్నం మరో ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో జూనియర్లతో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమావేశం అయ్యారు.
పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోతోందన్న ఆవేదనను సీనియర్ బ్యాచ్ వ్యక్తం చేస్తే, పార్టీని బలోపేతం చేయాలన్న అంశాలపై జిల్లా అధ్యక్షుడు ప్రసంగించారు. ఏది ఏమైనా రాష్ట్రంలోనే అత్యంత హాట్ టాపిక్‌గా మారిన హుజురాబాద్ ఎన్నికల ఎపిసోడ్‌లోనూ బీజేపీలోని వర్గాలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నానికే ప్రాధాన్యం ఇవ్వడం విస్మయపరుస్తోంది.