నేను తీసుకున్న గొప్ప నిర్ణయం అదే : కరీనా

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించిన కరీనాకు.. తన ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ చాలా ప్రత్యేకమని చెప్తోంది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘రెఫ్యూజీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ.. తన ఫస్ట్ షాట్ ఉదయం నాలుగు గంటలకు ఉందని తెలిపింది. ఆరోజు మార్నింగ్ లేచి తనని తాను అద్దంలో చూసుకుని.. ఇది తను అప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ అని అనుకుందట. 20 ఏళ్ల హార్డ్ వర్క్, డెడికేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనను ఈ స్థాయిలో ఉంచిందన్న కరీనా.. ఇన్నాళ్లుగా తనను సపోర్ట్ చేస్తూ ప్రేమిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన జేపీ దత్తాకు థ్యాంక్స్ చెప్పిన కరీనా.. అభిషేక్ బచ్చన్ స్వీటెస్ట్ కో-స్టార్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా రెఫ్యూజీ మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన బెబో.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనుందని చెప్తోంది.

Advertisement