- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనసులపై కాస్త దయ చూపండి : కరీనా
దిశ, సినిమా : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్.. మెంటల్ హెల్త్‌కు సంబంధించి పలు సూచనలు చేసింది. పాండమిక్ టైమ్‌లో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులు ప్రతికూలంగా మారితే సాయం అడిగేందుకు వెనకాడొద్దని ఫ్యాన్స్‌కు సూచించింది.
ఈ మేరకు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపిన కరీనా.. కఠిన పరిస్థితులు ఎదురైతే ఇష్టమైన వారితో టైమ్ స్పెండ్ చేయాలని లేదంటే ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించి, సమస్య నుంచి త్వరగా బయటపడాలని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా నమోదు కాగా, 3890 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమితాబ్, ప్రియాంక, అనుష్క శర్మ, సోనుసూద్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొచ్చి కొవిడ్ కట్టడికి కంట్రిబ్యూట్ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్ప్‌ఫుల్ ఇన్‌ఫర్మేషన్ షేర్ చేసిన కరీనా.. జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.