ఐసీయూలో టాలీవుడ్ లేడీ డైరెక్టర్

by Jakkula Samataha |
ఐసీయూలో టాలీవుడ్ లేడీ డైరెక్టర్
X

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘రాజు గాడు’ సినిమా ద్వారా దర్శకురాలిగా మారిన సంజనా రెడ్డి.. ఈ మధ్య ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ‘కరణం మల్లీశ్వరి’ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇండస్ట్రీలో ఈ బయోపిక్ విషయమై ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సంజనారెడ్డి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఉన్నట్లుండి పడిపోయిన సంజనాను చూసి తన పెంపుడు కుక్క అరవడంతో అక్కడికి చేరుకున్న వాచ్‌మన్ తనను హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఐసీయూకు షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికీ తన పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed