ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పెద్దపీట: కన్నబాబు

by srinivas |   ( Updated:2020-07-16 10:23:00.0  )
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పెద్దపీట: కన్నబాబు
X

దిశ ఏపీ బ్యూరో: ఆహార శుద్ధి పరిశ్రమలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధితో పాటు గ్రామీణ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా ఆహార శుద్ధి కర్మాగారాలను ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు చేశారని ఆయన చెప్పారు.

ఆహార పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఆహార ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉండాలని కన్నాబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు నూతన విధానానికి రూపకల్పన చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆహార శుద్ది పరిశ్రమల అభివృద్దికి క్లస్టర్ విధానం ఏర్పాటు చేయాలని సీఎం అన్నారని ఆయన వెల్లడించారు. నాబార్డు మార్గదర్శకాలు, ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెస్సింగ్ పాలసీని తయారు చేయాలని ఆయన సూచించారు. జిల్లాకు ఒక పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఉండాలన్న ఆయన ఈ మేరకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed