కంగనా చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్స్.. అది చూపించుకోవడానికేనా అంటూ..?

by Shyam |   ( Updated:2021-09-21 06:00:40.0  )
కంగనా చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్స్.. అది చూపించుకోవడానికేనా అంటూ..?
X

దిశ, సినిమా: రీసెంట్‌గా రిలీజైన ‘తలైవి’ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్.. మరో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో కరీనా పిక్చర్ షేర్ చేస్తూ ‘మా అందరిలోకెల్లా అందమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పోస్టు చేసింది. సాధారణంగా ఇదేమంత విశేషం కానప్పటికీ బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో రూపొందుతున్న ‘సీత: ది కార్నేషన్’ ప్రాజెక్ట్‌లో కంగనా సీత క్యారెక్టర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ రోల్‌కు కరీనాను ఎంచుకున్న మేకర్స్.. తలైవి రిలీజ్ తర్వాత కంగనాను ఫైనలైజ్ చేశారు. దీని గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే కరీనాకు విషెస్ తెలపడం పట్ల ఏమైనా మతలబు ఉందా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో నెపోటిజంపై తరచూ కామెంట్స్ చేసే కంగన.. ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన తన సత్తాను గుర్తుచేసేందుకే ఎప్పుడూ లేనిది కొత్తగా కరీనాకు బర్త్‌డే విషెస్ తెలిపిందనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

ఇక ‘సీత : ది ఇన్‌కార్నేషన్’ ప్రాజెక్ట్‌లో నటించేందుకు కరీనా రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసినందుకే ప్రొడక్షన్ హౌస్ ‘ఎస్‌ఎస్ స్టూడియోస్’ ఆమెను తప్పించి కంగనాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమా ఐదు భారతీయ భాషల్లో తెరకెక్కుతుండగా.. సౌత్‌లో కంగనా మార్కెట్‌ కూడా ఇందుకు హెల్ప్ చేసిందని టాక్.

ముంబైకి మకాం మార్చనున్న సమంత.. అందుకేనా?

Advertisement

Next Story