- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేటా.. తాతకు దగ్గులు నేర్పుతున్నావా? : Kangana Ranaut
దిశ, సినిమా : ఇజ్రాయెల్ ఇష్యూపై ఎలాంటి అవగాహన లేదని కొద్ది రోజులుగా తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు హీరోయిన్ కంగనా రనౌత్ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. అసలు విషయానికొస్తే.. ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణలపై కంగన వ్యక్తం చేసిన అభిప్రాయాలు విమర్శలకు గురవుతున్నాయి. ట్విట్టర్ తన అకౌంట్‌ను సస్పెండ్ చేయడంతో ఇన్‌స్టా స్టోరీస్‌లో తన ఆలోచనలను వెల్లడిస్తున్న ఫైర్ బ్రాండ్.. తాజాగా ఆ దేశాల మధ్య వివాదం రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతోందనే వివరాలతో కూడిన ఓ వీడియో స్ర్కీన్ షాట్‌ను షేర్ చేసింది.
అంతేకాదు ఈ వీడియోకు ఓ నోట్ జతచేసి, తనను విమర్శించిన నెటిజన్ల నోరు మూయించింది. ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడిందో వీడియోలో క్లియర్‌గా చూడొచ్చని తెలిపిన కంగన.. అది చట్టవిరుద్ధంగా ఏర్పడలేదని, బ్రిటిషర్ల నుంచి తిరిగి పొందారని చెప్పింది. ఐక్యరాజ్య సమితి సమక్షంలో తమ దేశ భూభాగ సమస్యను పరిష్కరించుకున్నప్పుడు వారిపై 6 ముస్లిం దేశాలు అటాక్ చేశాయని, అప్పటి నుంచి జరిగిన దాడుల్లో గెలిచిన ప్రతీసారి మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వచ్చాయని.. యుద్ధంలో గెలిచాక ఎక్కడైనా ఇదే జరుగుతుందని ఇజ్రాయెల్-పాలస్తీన ఇష్యూ గురించి వివరించే ప్రయత్నం చేసింది. ఫైనల్‌గా తనకేమీ తెలియదని వాగిన వారందరినీ ఉద్దేశిస్తూ ‘బేటా.. ఐయామ్ ది మదర్ ఆఫ్ ఆల్ ఫాదర్స్.. ఇకముందు మీ స్థాయి తెలుసుకుని మాట్లాడండి’ అని హెచ్చరించింది.