ఈ సారి ఇందిరా గాంధీగా కంగనా రనౌత్

by Shyam |
ఈ సారి ఇందిరా గాంధీగా కంగనా రనౌత్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో టైటిల్ రోల్ చేసింది. జయలలితగా తెరపై మెస్మరైజ్ చేయనున్న కంగనా…ఇందుకోసం తనను తాను మౌల్డ్ చేసుకుంది. ఇదిలా ఉంటే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లో భారత ప్రథమ మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇది బయోపిక్ కాదని.. పొలిటికల్ డ్రామా అని తెలిపింది. ఈ చిత్రం ద్వారా తమ జనరేషన్ ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న సామాజిక – రాజకీయ దృశ్యాల గురించి తెలుసుకోగలరని అభిప్రాయపడింది.

చాలా మంది ప్రామినెంట్ యాక్టర్స్ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా..ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీలో ఐకానిక్ లేడి ఇందిరాగాంధీ పాత్ర పోషించేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపింది. సాయి కబీర్ డైరెక్షన్‌లో సినిమా వస్తుండగా..సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మోరార్జీ దేశాయి, లాల్ బహదూర్ శాస్త్రిలాంటి మహానుభావుల పాత్రలు ఇందులో ఉంటాయని చెప్పింది.

Advertisement

Next Story