- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజీలాండ్ 431 ఆలౌట్.. పాకిస్తాన్ 30/1
దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి రోజు కెప్టెన్ కేన్ విలియమ్ సన్ (94), రాస్ టేలర్ (70) సమయోచితన ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో 222/3కు ముగించింది. ఓవర్ నైట్ స్కోర్ 222/3తో బ్యాటింగ్ ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ నిలకడగా ఆడారు. నికోలస్, విలియమ్‌సన్ ఓవర్ నైట్ స్కోరకు 44 పరుగులు జోడించిన తర్వాత వారి భాగస్వామ్యం విడిపోయింది. హెన్నీ నికోలస్ (56) అర్దసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత నసీమ్ ఖాన్ బౌలింగ్‌లో షాన్ మసూద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరి కొద్ది సేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న కేన్ విలియమ్‌సన్ (129) కూడా షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అయితే వాట్లింగ్ (74) పాకిస్తాన్ బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నాడు. మిచెల్ సాంట్నర్ (19) కైల్ జేమిసన్ (32) తో కలసి న్యూజీలాండ్ స్కోరును పెంచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. వాట్లింగ్ క్రీజులో పాతుకొని పోయాడు. అతడు అవుటైన తర్వాత నీల్ వాగ్నర్ (19), ట్రెంట్ బౌల్ట్ (8) పరుగులు రాబట్టినా వికెట్లు పారేసుకున్నారు. దీంతో న్యూజీలాండ్ 155 ఓవర్లలో 431 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కేన్ విలియమ్‌సన్ సెంచరీ, వాట్లింగ్, టేలర్, నికోలస్ అర్దసెంచరీలతో న్యూజీలాండ్‌ను ఆదుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షాన్ మసూద్ 10 పరుగులకే పెవీలియన్ చేరాడు. అబిద్ అలీ (19), మహ్మద్ అబ్బాస్ (10) మరో వికెట్ పడకుండా కాపాడారు. దీంతో పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 30 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్ బోర్డు
న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 30/1