- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధరణి రిజిస్ట్రేషన్లలో ఆ జిల్లా స్టేట్ ఫస్ట్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో తెలంగాణలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన శనివారం మాట్లాడుతూ…. జిల్లాలో ఇప్పటివరకు 434 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు 20 నిమిషాల వ్యవధిలోనే ముటేషన్ పూర్తిచేసి పాస్ పుస్తకం నకలు అందజేస్తున్నామని చెప్పారు.
అంతకుముందు ఒక రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్ తో చేయించారు. పాస్ పుస్తకం నకలును మహిళా రైతుకు అందజేశారు. లింగుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. తేమశాతం 17 వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.