- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెమో జారీ చేసిన కామారెడ్డి కలెక్టర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి నరేశ్ తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా జిల్లాలోని కొంతమంది గ్రామపంచాయతీ సర్పంచులకు నోటీసులు జారీ చేయడంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ చాలా సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ నోటీస్ లోకి తీసుకురాకుండా, అనుమతి లేకుండా వైకుంఠధామం, ఇతర పనులకు సంబంధించి పనులు చేయడం లేదని జిల్లాలోని కొంత మంది గ్రామ సర్పంచులకు కొత్తగా వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి నరేశ్ నోటీసులు జారీ చేయడం సీరియస్ గా పరిగణించిన జిల్లా కలెక్టర్.. జిల్లా పంచాయతీ అధికారికి మెమో జారీ చేశారు. 24 గంటల లోపల సంజాయిషీ తెలుపాలని మెమోలో ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను విచారణ అధికారిగా నియమించారు. జిల్లా పంచాయతీ అధికారి గ్రామ సర్పంచులకు జారీ చేసిన నోటీసుల పట్ల సర్పంచులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.