మరో క్రేజీ చాన్స్ కొట్టేసిన చందమామ

by Shyam |
మరో క్రేజీ చాన్స్ కొట్టేసిన చందమామ
X

కొత్త నీరు వస్తే పాత నీరుతో పని లేదనే సామెత గురించే తెలిసే ఉంటుంది. కానీ ఈ సామెత బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం సరికాదని అనిపిస్తోంది. ఇండస్ట్రీకి ఎన్ని కొత్త ఫేస్‌లు వచ్చినా సరే.. చందమామకున్న అందానికి దాసోహం అంటూనే ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ పంచదార బొమ్మ.. తనకు తానే సాటి అంటూ మరోసారి క్రేజీ ఆఫర్ కొట్టేసింది.

ఇప్పటికే జిల్లా, తుపాకీ, అదిరింది సినిమాల్లో ఇళయ దళపతి విజయ్‌తో జతకట్టిన కాజల్.. ఇప్పుడు మరోసారి రొమాన్స్ చేయబోతోంది. మురుగదాస్ – విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటించబోతోంది. ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉండగా.. వీరిలో లీడ్ రోల్‌కు కాజల్ సెలెక్ట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. పరిస్థితులు నార్మల్ కాగానే షూటింగ్ మొదలు పెట్టే చాన్స్ ఉందని సమాచారం.

ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య, ఇండియన్ 2, హే సినామిక’తో పాటు బాలీవుడ్ మూవీ ‘ముంబై సాగా’ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

Advertisement

Next Story