- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, కాళోజి జంక్షన్: కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌తో రెండు తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయానని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జల వివాదాల్లో జోక్యం చేసుకొని కేంద్రం పెత్తనం చెలయించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల నెత్తిన చెయి పెట్టాలని చూసి తన రాష్ట్రం పైనే చేయి పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఏ విధమైన వివాదాలు లేని 107 చిన్న, మధ్య తరగతి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆరోపించారు.
రెండు రాష్ట్రాల అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం జల వివాదాలు సృష్టించిందని అన్నారు. ఇలాంటి వివాదాలను బీజేపీ స్వాగతించడం సిగ్గు చేటన్నారు. కేంద్రం ఇలాంటి నిర్ణయం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి రెండు విడతలుగా రైతులకు నీరు అందుతుందా? అని ప్రశ్నించారు. కృష్ణ గోదావరిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా విషయంలో రాష్ట్రానికి స్పష్టత ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే ఆచరణలో అమలవుతుందని కడియం స్పష్టం చేశారు.
ఇరు రాష్ట్రాల ప్రాజెక్ట్ లను కేంద్రం గుప్పిట్లో ఉంచుకోవడం వలన భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే ఆలోచనలో భాగమే బీజేపీ లక్ష్యమని, వారి కల ఎప్పటికీ నెరవేరదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ ,ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.