- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్యాగానికి ప్రతిరూపం కమ్యూనిజం.. చివరి వరకు పోరాడేది కమ్యూనిస్టులే
దిశ, మిర్యాలగూడ: సమాజం కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేసేది కమ్యూనిస్టులే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక టీఎన్ఆర్ గార్డెన్‌లో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. సేవకు, త్యాగానికి ప్రతిరూపం కమ్యూనిజం అన్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర నాయకులు సోమయ్య మాట్లాడుతూ.. పోరాటాలతో పుట్టుకొచ్చిన పార్టీ నేటికీ అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తోందని చెప్పారు. దోపిడీకి వ్యతిరేకంగా, వర్గ ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయని, తాత్కాలిక ప్రయోజనాలు ఆశ చూపి బూర్జువా పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని విమర్శించారు.
ఎర్రజెండా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. పాలకుల దోపిడీని నిర్మూలించేందుకు అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమించాలని, సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పోరాటాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ నూకల జగదీష్ చంద్ర, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, డాక్టర్ గౌతంరెడ్డి, రవినాయక్, శశిధర్ రెడ్డి, పాండు, వినోద్, సైదులు, పరుశురాం, అంజద్, వైస్ ఎంపీపీ గోవర్దని, శ్రీనివాస్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.