Karmanye Vadhikaraste : ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా నుంచి టీజర్ విడుదల..?

by Anjali |
Karmanye Vadhikaraste : ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా నుంచి టీజర్ విడుదల..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్‌ (Ushaswini Films Banner)పై డిఎస్‌ఎస్ దుర్గా ప్రసాద్ (DSS Durga Prasad)నిర్మాణంలో వస్తోన్న తాజా చిత్రం కర్మణ్యే వాధికారస్తే (Karmaṇye vadhikarasthe). ఈ మూవీలో బ్రహ్మాజీ (Brahmaji), శత్రు, మహేంద్రన్ (Mahendran), పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా (Shri Sudha), బెనర్జీ, అజయ్ రత్నం (Ajay Ratnam) కీలక పాత్రల్లో నటస్తున్నారు. ఈ సినిమాను అమర్‌దీప్ చల్లపల్లి (Amardeep Challapalli) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.

ప్రజెంట్ నేడు ప్రపంచంలో జరుగుతోన్న సంఘటనల ఆధారంగా కర్తవ్యమే దైవంగా అనుకునే పోలీసు ఆఫీసర్ల టీమ్ కథాంశంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. కానీ ఈ మూవీని విడుదల తేదీని దర్శక, నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా రివీల్ చేయనున్నారని సోషల్ మీడియా టాక్. ప్రస్తుతం ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Next Story

Most Viewed