- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Army Nursing College: ఉగ్రదాడి తర్వాత ఆర్మీ నర్సింగ్ కాలేజ్ వెబ్ సైట్ హ్యాక్..!

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజులకే ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. పాకిస్థాన్‌కు చెందిన టీమ్ ఇన్సేన్ పీకే అనే హ్యాకర్ గ్రూప్ హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. భారత్- పాకిస్థాన్ మధ్య విబేధాలను రెచ్చగొట్టేలా సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఓ సందేశాన్ని వదిలారు. కాగా.. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) సాయాన్ని నర్సింగ్ కాలేజ్ కోరనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వీసా సస్పెన్షన్ సహా ఇలా ఐదు వరుస చర్యలను ప్రకటించిన రెండ్రోజుల తర్వాత హ్యాకర్ల దాడి జరగడం గమనార్హం.
గతంలోనూ వెబ్ సైట్లు హ్యాకింగ్
గతంలోనూ పలు అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్, సైబర్ దాడుల వెనుక ఈ టీం ఇన్నేన్ పీకే ఉందని అధికారులు చెబుతున్నారు. సిస్టమ్‌లోకి ఆర్బిట్రరీ కోడ్‌లను జొప్పించడం, సర్వీస్‌లను తిరస్కరించడం (DoS), లక్షిత సిస్టమ్‌లలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2023లో భారత్ లో జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా ప్రభుత్వ వెబ్ సైట్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఏప్రిల్ 22న పెహల్గామ్ లో పర్యాటకులపై ముష్కరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.