- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతులకు దీదీ అన్యాయం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, కేంద్ర పథకాల కింద అందాల్సిన ప్రయోజనాలకు మోకాలడ్డుతున్నదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా సర్కారుకు ప్రజలు గుడ్ బై చెబుతారని అన్నారు. తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో రైతుల దరిచేరడానికి బీజేపీ చేపడుతున్న క్రిషక్ సురక్షా అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి జేపీ నడ్డా మాట్లాడారు. మమత బెనర్జీ తనకున్న అహంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను రైతులకు చేరకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఏడాదికి రూ. 6,000లను రైతులకు అందిస్తున్నారని వివరించారు. కానీ, ఈ కార్యక్రమం బెంగాల్‌లో అమలుకాకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డుకుంటున్నదని విమర్శించారు. ఫలితంగా రెండేళ్లుగా కనీసం 70 లక్షల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి ఫలాలను అందుకోవడం లేదని చెప్పారు. రైతులకు సరైన మౌలిక వసతులు, నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించలేదని, ధాన్యాగారాలనూ సరిపడా నిర్మించలేకపోయిందని ఆరోపించారు.