- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాడిదతో ఇంటర్వ్యూ… నెట్టింట్లో తెగ వైరల్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీని బారిన పడ్డ అనేక దేశాలు ఇప్పటికే అతలాకుతలం అయ్యాయి. అంతేగాకుండా మానవ జీవన విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనాలు ఎప్పుడు వెంట మూతికి మాస్కు, చేతులకు శానిటైజర్, సామాజిక దూరం లాంటివి తప్పక పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా కొందరు వ్యక్తులు ఎంత చెప్పినా కరోనా జాగ్రత్తలు పాటించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి కోసం ఓ జర్నలిస్టు వినూత్నంగా చెప్పించాడు. ఓ గాడిదను అడ్డం పెట్టుకొని మాస్క్ పెట్టుకోని వాళ్లందరినీ గాడిదలు అని ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేశాడు ఓ జర్నలిస్ట్. గాడిదను ఇంటర్వూ చేసిన వీడియో నెట్టిట్లో తెగ వైరల్ అవుతున్నది. ‘నువ్వు మాస్క్ ఎందుకు ధరించలేదు. కనీసం శానిటైజర్ కూడా వాడడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు. కరోనా పట్ల నీకు అవగాహన లేదా?’ అని ఇంటర్వూలో గాడిదను ప్రశ్నించాడు. అది ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో..
రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని అడిగాడు. నేను అడిగిన ప్రశ్నలు వేటికి గాడిద సమాధానం ఇవ్వలేదని, ఆ ప్రశ్నలేంటో వివరించాడు. అందుకు ఆ వ్యక్తి గాడిద మాట్లాడదు కదా, కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ ధరిచాలి అని గాడిదకు తెలియదు కదా అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. దీనికి ఆ జర్నలిస్టు బదులిస్తూ, అంటే మాస్క్ ధరించని వారిని గాడిదతో పోల్వచ్చా అన్నాడు. హా.. అంతే కదా అని జవాబిచ్చాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే.. సమాధానం ఇచ్చిన వ్యక్తి కూడా గాడిదలా మాస్క్ పెట్టుకోలేదు. తనని తానే గాడిద అనుకున్న విషయం కూడా కనిపెట్టలేకపోయాడు.