సన్నబియ్యం పంపిణీ పథకానికి ప్రజాదరణ.. రేషన్ షాపుల ఎదుట జనం బారులు

by Shiva |
సన్నబియ్యం పంపిణీ పథకానికి ప్రజాదరణ.. రేషన్ షాపుల ఎదుట జనం బారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం ప్రజాదరణ పొందుతుంది. ఎన్నడులేని విధంగా లబ్దిదారులు ఇంత పెద్ద మొత్తంలో రైస్​ తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాగా 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం మంది లబ్దిదారులు సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి రేషన్​దుకాణాల వద్ద లబ్దిదారుల క్యూలైన్​కనిపించింది. డీలర్లు ఉదయం, సాయంత్రం వేళ్లలో దుకాణాలు తెరిచి అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఎన్నడూ లేని విధంగా రేషన్​కోటా రెండు సార్లు సరఫరా చేసుకోవాల్సి వచ్చింది. మొదటి విడత ప్రారంభించిన నాలుగు రోజులకే ఖాళీ అయింది. రెండో ధఫా కూడా వారం రోజులో పూర్తిగా మరోసారి తీసుకొచ్చేందుకు డీడీలు చెల్లించినట్లు జిల్లా పౌరసరపరాల అధికారులు చెప్పారు.

2.29 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ

రాష్ట్రంలో 90.19 లక్షల రేషన్ కార్డులు ఉండగా దాదాపు 3.10 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 15వ తేదీ నాటికి 76 లక్షల రేషన్ కార్డులకు సంబంధించిన 2.29 కోట్ల మంది లబ్దిదారులు సన్న బియ్యం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 2 లక్షల మెట్రిక్​టన్నుల నెలా కోటా బియ్యం సరఫరా చేయగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.58 లక్షల మెట్రిక్​టన్నుల సన్న బియం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పంపిణీ చేశారు. ఈపథకానికి ప్రభుత్వం గత కంటే అదనంగా రూ.2,858 కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి లబ్దిదారునికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తోంది. ప్రస్తుతం ఈ పథకం 32 జిల్లాలోనే కొనసాగుతుంది.

లబ్దిదారుల ఇళ్లల్లో నేతల భోజనాలు

రాష్ట్ర సర్కార్ అట్టహాసంగా సన్నబియ్యం పథకం ప్రారంభించినా.. ఆశించిన స్ధాయిలో ప్రభుత్వానికి ఆదరణ రాలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో లబ్దిదారుల ఇళ్లల్లోకి వెళ్తూ సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీంతో మండలమంతా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్​ప్రభుత్వం ఇస్తుందని ప్రజలు భావిస్తారని, ఇప్పటికే బీజేపీ నేతలు మోడీ బియ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారి దీటుగా కౌంటర్​ఇచ్చేందుకు ఈ విన్నూతం కార్యక్రమం అధికార పార్టీ నేతలు చేపట్టారు.


Advertisement
Next Story

Most Viewed