- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పార్టీలో చేరండి.. మీరే సీఎం అభ్యర్థి..!
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ సీఎం అభ్యర్థిని దాదాపుగా ప్రకటించాయి. అయితే పుదుచ్చేరిలో సీఎం అభ్యర్థి ప్రకటనలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పుదుచ్చేరిలో బీజేపీ, ఏడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్‌లు కూటమిగా ఉన్నాయి.
అయితే కూటమిలో భాగంగా తమ పార్టీకి చెందిన నాయకుడే సీఎం అభ్యర్థిగా ఉండాలని పార్టీలు పట్టుపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నుండి నమశివాయంను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆలోచిస్తుండగా.. సీఎం అభ్యర్థిగా తానే ఉంటానంటూ ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగాస్వామి బాంబు పేల్చారు. దీంతో ఒక్కసారిగా అసమ్మతి బయటకు వచ్చింది. కూటమిలో ఉంటూనే ఎన్ఆర్ కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారంటూ రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీట్ల సర్దుబాటు కోసం జరిగిన కూటమి సమావేశానికి రంగస్వామి హాజరు కాలేదు.
రాష్ట్రంలో అన్ని విషయాలను గమనిస్తున్న డీఎంకే రంగస్వామికి భారీ ఆఫర్ ఇచ్చింది. ఎన్ఆర్ కాంగ్రెస్ తమతో కూటమిగా ఏర్పడాలని కోరింది. మరో అడుగు ముందుకేసి రంగస్వామినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా తెలిపింది. దీంతో ఒక్కసారిగా పుదుచ్చేరిలో రాజకీయాలు వేడెక్కాయి.