విజయనగరం డీసీసీబీలో మేనేజర్ పోస్టులు

by Harish |
విజయనగరం డీసీసీబీలో మేనేజర్ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ).. మేనేజర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మేనేజర్ పోస్టులు: 6

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ (ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్), కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్తులకు ప్రాధాన్యం ఉంటుంది. విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

వయసు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

రాత పరీక్ష తేదీ: మే /జూన్ 2023.

వెబ్‌సైట్: https://www.dccbvizianagaram.com

Advertisement

Next Story