గుడ్ న్యూస్.. TSPSC 3 నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు వెల్లడి

by Harish |
గుడ్ న్యూస్.. TSPSC 3 నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు వెల్లడి
X

దిశ, కెరీర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఇటీవల వేల సంఖ్యలో ఉద్యోగులను నియామకం చేసేందుకు వివిధ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించగా ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే గ్రూప్ -1, 2, 4 నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో 3 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించింది.

1. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష తేదీ: మార్చి 15 ఉదయం, సాయంత్రం, మార్చి 16న ఉదయం ఈ పరీక్షలు ఉంటాయి.

2. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 04 ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

3. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 23న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story