ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా…

by Aamani |
job-fair 1
X

దిశ, అసిఫాబాద్: ఈ నెల 30వ తేదీన జిల్లాలోని కాగజ్ నగర్‌లో గల మండల సమాఖ్య కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి రవి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.7వ తరగతి నుండి డిగ్రీ, ఏఎన్ఎం/జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ విద్యా అర్హత కలిగిన వారికి వివిధ స్థాయిలలో అపోలో ఫార్మసీ, డీడీయు, జీకేవై, ఆర్ఎస్ఈటీఐ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.

అర్హత గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తమ విద్యార్హత ధృవ పత్రాలు, బయో డేటాతో హాజరుకావాలని, వివరాలకు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed