నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఈనెల 29న ఆన్ లైన్‌లో జాబ్ మేళా

by Shyam |
job-fair 1
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి జయశ్రీ తెలిపారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్‌లైన్‌ జాబ్ మేళా ఈనెల 29వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఉంటుందని వివిధ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. అర్హత ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు www.NCS.GOV.in పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

కంపెనీ ప్రతినిధులచే ఆన్‌లైన్‌ వెబినార్ ద్వారా ప్రాథమిక ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ఫైనల్ ఇంటర్వ్యూ వివరములు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మీయొక్క బయోడేటా, రెజ్యూమ్‌లను [email protected] కు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీ.రఘుపతి యంగ్ ప్రొఫెషనల్ 8247656356ను సంప్రదించగలరని, జూమ్ మీటింగ్ ఐడి నెంబర్78443161224 పాస్ కోడ్ 123456 అని రిజిస్ట్రేషన్ ఐడీ. https:// forms.gel//UcYvxBpgwlam1G4g8 అని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed