- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కంపెనీకి మన ముఖాన్ని అమ్మేయొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: ‘స్పైడర్‌మన్, బ్యాట్‌మన్, బెన్ 10’ వంటి రకరకాల ఫేస్ మాస్క్‌ల గురించి మనకు తెలుసు. వీటితో పాటు రాజకీయ నాయకులు, సినీ హీరోల ఫేస్ మాస్క్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతుంటాయి. అయితే, ఇకపై మన మాస్క్‌లు కూడా మార్కెట్‌లో దొరకొచ్చు. ఎలాగని ఆశ్యర్యపోకండి! ఓ జపనీస్ కంపెనీ మన ముఖాలను కొంటానంటోంది. మీకు అమ్మాలనుకుంటే అమ్మేయొచ్చు. అప్పుడు మీ ఫేస్ మాస్క్‌లు కూడా లభిస్తాయి.
టోక్యోకు చెందిన స్పెషాలిటీ మాస్క్ మేకర్ స్టోర్ కామెన్య ఒమోటో ‘ఫేస్’లను కొంటామని ఓ ప్రకటన ఇవ్వడమే కాకుండా, ఒక్కో ముఖానికి 28 వేల రూపాయలు (40,000 యెన్) ఇస్తామని చెబుతోంది. ఆ కంపెనీ సదరు వ్యక్తుల నుంచి ముఖానికి సంబంధించిన కొలతలు తీసుకుని, దాంతో హైపర్ రియలిస్టిక్ 3డీ ప్రింటెడ్ మాస్క్‌లు తయారు చేస్తోంది. ఆ 3డీ మాస్క్‌లను మార్కెట్లో 69 వేలకు విక్రయిస్తోంది. అంతేకాదు ఆ మాస్క్‌లకు ఉన్న గిరాకీని బట్టి, సదరు వ్యక్తికి ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘దట్ ఫేస్’ అని పేరు పెట్టారు.
అయితే ‘దట్ ఫేస్’ అనేది కాస్త కాంట్రవర్సీతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే.. ప్రస్తుత యుగంలో ప్రైవసీ, పర్సనల్ డేటా ఎంతో ముఖ్యం. అలాంటిది మన ఫేస్ రైట్స్ వేరే వారికి ఇచ్చేస్తే? మన ముఖాన్ని సేమ్ అలానే తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తే, ఆ మాస్క్ ఆధారంగా ఆ వ్యక్తి ఏం చేసినా, సీసీ ఫుటేజ్‌లో మన ఫేస్ ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఆ నేరానికి ఎవరు బాధ్యులు? సదరు కంపెనీనా? లేదా ముఖాన్ని అమ్ముకున్న వ్యక్తా? ఇవన్నీ ప్రశ్నార్థకాలే. అయితే కంపెనీ మాత్రం ఫేస్ మాస్క్ వల్ల ఫేమస్ అయిపోతారని, వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతామని చెబుతోంది. ఏదేమైనా, ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.