ఇంట్రెస్టింగ్ అబద్ధంతో.. యంగ్‌స్టర్ హార్ట్ బ్రేక్ చేసిన జాన్వీ

by Shyam |
Janhvi Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రజెంట్ ‘రూహి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా సక్సెస్ మీట్స్‌లో పాల్గొంటున్న జాన్వీ..తాను ఓ యువకుడి లవ్ ప్రపోజల్‌‌ను ఎలా రిజెక్ట్ చేసిందో చెప్పింది. యువకుడు తనకు లవ్ ప్రపోజ్ చేయగా ‘నాకు ఎగ్జామ్స్ ఉన్నాయ్..పరీక్ష మీద తప్ప దేని మీద కాన్సంట్రేట్ చేయలేను’ అని అబద్ధం చెప్పానని, అయితే ఆ తర్వాత తాను ఎగ్జామ్ గురించి మరిచిపోయానని, స్పానిష్ టెస్ట్‌కు అటెండ్ కూడా కాలేదని తెలిపింది. ఈ క్రమంలో ఆలియా భట్ యాక్టింగ్‌కు ఫ్యాన్ అని తెలిపిన జాన్వీ, కోస్టార్ కార్తీక్ ఆర్యన్ చాలా ఇంటెలిజెంట్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకే తన మెదడు దొంగలించాలి అనుకుంటున్నాను అంది. జాన్వీని బయటకు తీసుకెళ్లేందుకు పది సెకన్లలో ఒప్పించే మార్గం గుడ్ ఫుడ్, నైస్ జోక్స్ అని, ఇవి రెండూ ఉంటే షికారుకు వెళ్లేందుకు వెంటనే ఓకే చెప్పేస్తానని తెలిపింది.

Advertisement

Next Story