కాసేపట్లో సైదాబాద్ చిన్నారి ఇంటికి పవన్ కళ్యాణ్

by Shyam |   ( Updated:2021-09-15 04:33:16.0  )
janasena party chief pawan kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో పరామర్శించనున్నారు. స్వయంగా ఆయన వారి ఇంటికి చేరుకుని.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. దీంతో ఇప్పటికే హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్ జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, మరికొద్ది కాసేపట్లో జూబ్లీహిల్స్‌ నుంచి బయలుదేరి అక్కడకు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు సైతం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముంది. కాగా, కామాంధుడైన రాజు చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తాజాగా.. ఇవాళ వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Advertisement

Next Story