- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత జాతిని అమామానించినట్టే : జనసేన
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా చింతలపూడిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం మెడలో సంఘ విద్రోహశక్తులు చెప్పుల దండ వేయడం తీవ్రమై దుశ్చర్యగా పరిగణించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆ మహనీయుడిని అవమానించడం అంటే.. భారత జాతిని అవమానించినట్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి దశ-దిశ చూపిన మహోన్నత వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదా? అని ప్రశ్నించారు. అంతేగాకుండా.. ఈ దారుణం జరిగి 36 గంటలు దాటుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిందితులను పట్టించుకోకపోవడం పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. దోషులకు శిక్షపడేంత వరకూ జనసేన ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని అవమానించడం అంటే భారత జాతిని అవమానించడమే – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/z7iw3dJPEl
— JanaSena Party (@JanaSenaParty) February 1, 2021