ఆందోళన, నిరసనలకు ఇది సమయం కాదు: పవన్ కళ్యాణ్

by srinivas |
ఆందోళన, నిరసనలకు ఇది సమయం కాదు: పవన్ కళ్యాణ్
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కంపెనీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు సలహా ఇస్తూ… ‘జనసేన నేతలు, జనసైనికులకు నేనొక విన్నపం చేస్తున్నాను. ఇటువంటి నిరసనల్లో పాల్గొనకండి. దయచేసి బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టండి. ఆందోళనలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. గ్యాస్‌ లీక్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నివేదికలు అందేవరకు వేచి చూద్దాం’ అని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed