- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగన్ నూరు తప్పులు చేసేశారు : సినీనటుడు శివాజీ

దిశ, ఏపీ బ్యూరో : సీఎం వైఎస్ జగన్‌పై సినీనటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును సీఎం వైఎస్ జగన్ తొక్కేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విద్యార్థులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ ఎన్నో తప్పులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ చేసిన తప్పులు ఇప్పటికే వంద దాటేశాయని శివాజీ వ్యాఖ్యానించారు. అమరావతి మహిళల పాదయాత్ర చూసి జగన్ భయపడ్డారంటూ విమర్శించారు.
తిరుపతిలోని అమరావతి రైతులు నిర్వహించిన రైతు మహోద్యమ సభకు హాజరైన శివాజీ రైతులు పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అమరావతియే రాజధానిగా ఉండాలనే ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. ఈ మహోద్యమ సభ వేదికపై ఉన్న అన్ని పార్టీల నేతలే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఒక్క వైసీపీ మాత్రమే రాలేదని చెప్పుకొచ్చారు. రాజధానిపై నిర్ణయం తీసుకోవాల్సిన వైసీపీ నేతలు మాత్రం రాలేదని విమర్శించారు.